16 August, 2026 | 8:25 AM

Districts - Nalgonda

article_28915792.webp
కొర్లపాడు మోడల్ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

నకిరేకల్ (విజయ క్రాంతి): కొర్లపాడు మోడల్ స్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా, దేశభక్తి పూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో ఒక వినూత్న, అభినందనీయ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల చదువుకు పరోక్షంగా తోడ్పడుతూ సమాజానికి సేవలందిస్తున్న స్థానిక ఆర్టీసీ డ్రైవర్ కుమార్, కండక్టర్ బాధిని గౌతమిలను పాఠశాల యాజమాన్యం వేదికపై ఘనంగా సన్మానించింది. ప్రతిరోజూ ఎండనక, వాననక విద్యార్థులను ఎంతో సురక్షితంగా పాఠశాలకు చేరవేస్తూ, వారి క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసానికి సహకరిస్తున్న ఆర్టీసీ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కొనియాడారు.

15-08-2026