మహమ్మాయి ఆలయంలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు.
కన్నుల పండుగగా నిమజ్జన శోభాయాత్ర..
చిట్యాల, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): చిట్యాల మండలం నేరడ గ్రామంలోని శ్రీశ్రీ మహమ్మాయి శాంభవి దేవి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు(Vinayaka Navaratri celebrations) ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు పెందోట సత్యనారాయణ, సహ అర్చకులు శివకిరణ్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం గణనాథుని నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో తట్టుకునూరు శివప్రసాద్ రూ.31,116లకు లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పెందోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన భక్తులు, యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లడ్డూను దక్కించుకున్న శివప్రసాద్‌కు అభినందనలు తెలియజేశారు.