ప్రైవేట్ క్లినిక్‌లలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు

08-10-2026 | 02:26pm

నారాయణపేట జిల్లా మద్దూరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(Medical and Health Department Officer) (DM&HO) డాక్టర్ జయచంద్ర మోహన్ గురువారం మద్దూరులో పర్యటించారు. ఈ సందర్భంగా తజ్ క్లినిక్‌ను సందర్శించి అక్కడి వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రైవేట్ క్లినిక్‌లను తనిఖీ చేసి వైద్య సేవలు, రికార్డులు తదితర అంశాలను పరిశీలించారు.

అనంతరం సంబంధిత అధికారులకు, పోలీసు శాఖకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు