డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి మురుగునీటి సమస్య తీర్చండి

02-10-2026 | 08:03pm

మాగనూరు, అక్టోబర్ 2. మాగనూరు మండలంలో పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు ఇండ్ల మధ్య , అంతర్గత సిసి రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతు వాసన భరించలేక పోతున్నామని, రాత్రి వేళల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని ఆయా గ్రామల ప్రజలు తెలిపారు. మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు, ఈగల ద్వారా అంటు రోగాలు ప్రబలే పరిస్థితి ఉందన్నారు.

గ్రామాల్లో డ్రైనేజీ లేక మురుగునీరు నిలువ ఉంటున్న విషయాన్ని సంబంధించిన అధికారులకు, స్థానిక సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు ,తెలిపిన పట్టించుకోవడంలేదని ఆయా గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి డ్రైనేజీలు ఏర్పాటు చేసి మురుగునీటిని వేరే ప్రాంతానికి తరలించి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు