ఢిల్లీలో పొలిటికల్ హీట్
పార్లమెంట్లో పోరుకు సిద్ధమవుతున్న విపక్షాలు.. ఖర్గే ఇంట్లో సమావేశం!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షాల ఇండియా కూటమి (INDIA Alliance) కీలక సమావేశం నిర్వహించనుంది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Kharge) నివాసంలో ఈ భేటీ జరగనుంది. కూటమికి చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్లమెంట్ Special Session నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సభలో లేవనెత్తాల్సిన అంశాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన విషయాలు, ప్రతిపక్షాల ఉమ్మడి కార్యాచరణ (Joint Strategy)పై నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు.
కీలక అంశాలపై విపక్షాలన్నీ ఒకే గొంతుతో ముందుకు వెళ్లేలా సమన్వయం చేసుకోవడంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు, పార్లమెంట్ సమావేశాల వేళ INDIA Alliance ఎంపీల భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, సభలో చర్చకు వచ్చే అంశాలపై ప్రతిపక్షాలు ఎలాంటి వైఖరి తీసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఖర్గే నివాసంలో జరిగే ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పార్లమెంట్లో విపక్షాల తదుపరి అడుగులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.