ఇస్రో ప్రైవేటీకరణకాదు

08-09-2026 | 05:20am

చైర్మన్ వి.నారాయణన్   

బెంగళూరు, సెప్టెంబర్ 7: ఇస్రోను(ISRO) ప్రైవేటీకరించబోమని, ఇది ప్రభుత్వ సంస్థ(Government organization,)గానే కొనసాగుతోందని, దాని ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని చైర్మన వి.నారాయణన్(V. Narayanan) స్పష్టం చేశారు. అధునాతన అంతరిక్ష పరిశోధన, సాంకేతిక అభివృద్ధి(Technological development), జాతీయ, వ్యూహాత్మక మిషన్లు, అంతరిక్ష విజ్ఞానం, అన్వేషణ, కీలకమైన సరికొత్త అంతరిక్ష సామర్థ్యాల కోసం ఇస్రో భారతదేశపు ప్రధాన సంస్థ(ISRO is India premier organization)గా కొనసాగుతుందన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(Indian Space Research Organisation) (ఇస్రో) ప్రైవేటీకరణ(Privatization) జరగవచ్చని విస్తృతంగా వస్తున్న వార్తలు, ఊహాగానాలకు నారాయణన్ తెరదించారు.

ఇస్రోపై వస్తున్న ఆ వాదనలను ఖండిస్తూ, అవి ‘పూర్తిగా నిరాధారమైనవి, తప్పు’ అని పేర్కొన్నారు. బెంగళూరు స్పేస్ ఎక్స్‌పో(Bangalore Space Expo)లో పాల్గొన్న ఆయన పైవిధంగా స్పందించారు. ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం అనేది ఇస్రో పాత్రను తగ్గించడం కోసం కాదు.. పరిశ్రమలు పరిణతి చెందిన సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో, భారతదేశ అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం సుమారు 450 పరిశ్రమలు ఇస్రోతో కలిసి పని చేస్తున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు