ఢిల్లీ భవనం కూలిన ఘటనలో యజమాని అరెస్ట్

08-09-2026 | 05:30am
  1. రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు 
  2. బేస్మెంట్ తవ్వకాలే ప్రమాదానికి కారణమని నిర్ధారణ 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7(విజయక్రాంతి): ఏడుగురి ప్రాణాలు బలిగొన్న ఢిల్లీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ భవన దుర్ఘటనపై ఢిల్లీ పోలీసులు(Delhi Police) దర్యాప్తును ముమ్మరం చేయగా, ఆ భవన యజమాని హరిరామ్ భన్సాల్‌(Hariram Bhansal)ను రాజస్థాన్‌(Rajasthan)లోని భివాడీ వద్ద అరెస్టు చేశారు. భవనం కూలిన(Building collapse) ఘటన అనంతరం బన్సాల్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో, ఢిల్లీ పోలీసులు 10 బృందాలతో మూడు రాష్ట్రాల్లో భారీ గాలింపు చర్యలు చేపట్టారు. ఆ భవన యజమానిని రాజస్థాన్‌(Rajasthan)లోని భివాడి ప్రాంతం నుంచి సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

భవనం కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతు పనులపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆపై యజమాని మీద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేఖా గుప్తా ఆదేశాల మేరకు మేజిస్ట్రేట్ విచారణ కొనసాగుతోంది. పోలీసు వర్గాల సమాచారం మేరకు ఆదివారం భవనం కూలిపోయిన వెంటనే, తనకు తెలిసిన ఒక వ్యక్తి నుంచి బన్సాల్‌కు ఈ ఘటన గురించిన సమాచారం అందింది.

భవనం కూలిన సమయంలో బన్సాల్ గురుగ్రామ్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన వెంటనే తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, నగరం విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. యజమాని వివరాలు సేకరించిన తర్వాత పోలీసులు ఆయనను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ, అందుబాటులోకి రాలేదు. బన్సాల్ ఆచూకీ కనుగొనడానికి, దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకోవడానికి‘’లుక్ అవుట్ సర్క్యులర్’ (ఎల్‌వోసీ) జారీ చేశామని పొలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు