ఉక్రెయిన్‌పై రష్యా భారీదాడి

22-09-2026 | 05:20am
  1. జపోరిజ్జియా సిటీపై డ్రోన్లవర్షం
  2. మరో 9 ప్రాంతాలపై కూడా మాస్కో ఎటాక్

కీవ్, సెప్టెంబర్ 21: ఉక్రెయిన్‌(Ukraine)లోని దక్షిణ నగరం జపోరిజ్జియా(Zaporizhzhia)తో సహా మరో 9 ప్రాంతాలపై కూడా రష్యా డ్రోన్ల(Russian drones)తో విరుచుకుపడింది. లాజిస్టిక్స్ హబ్‌లు(Logistics hubs), గిడ్డంగులు, ఓడరేవులతో పాటు ఇతర సైనిక సంబంధిత ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ వైమానిక దాడుల సమయంలో డ్రోన్లు పదేపదే పొరుగు దేశాలైన మోల్డోవాలో, రొమేనియాలోకి ప్రవేశిస్తున్నాయి. 244 ఉక్రేనియన్ డ్రోన్లను రష్యా, 148 డ్రోన్లను ఉక్రెయిన్ తమతమ దేశాల్లో కూల్చివేశాయి. ఈ మేరకు అధికారులు సోమవారం తెలిపారు.

కీవ్ దళాలు(Kyiv forces) రష్యాపై 1,000కు పైగా డ్రోన్లను ప్రయోగించిన ఒక రోజు తర్వాత ఈ తాజాగా మాస్కో దాడులు చేసింది. అపార్ట్‌మెంట్ బ్లాకులు, షాపింగ్ మాల్‌పై రష్యా దాడి చేసిందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి జపోరిజ్జియాపై రష్యా జరిపిన బాంబు దాడిలో అపార్ట్‌మెంట్ బ్లాకులు, ఒక విశ్వవిద్యాలయం(University), షాపింగ్ మాల్తో పాటు ఇతర ప్రదేశాలు దెబ్బతిన్నాయని ఐదుగురు గాయపడ్డారని జెలెన్‌స్కీ సోమవారం సోషల్ మీడియాలో తెలిపారు. ఉక్రెయిన్‌లోని మరో తొమ్మిది ప్రాంతాలపై కూడా రష్యా దాడి చేసిందని ఆయన చెప్పారు.

‘రష్యా తన ఉద్రిక్తతను తగ్గించడం లేదని, యుద్ధాన్ని విస్తరించడానికి సిద్ధంగా ఉందని అనేక సంకేతాలు పంపుతోంది’ అని జెలెన్‌స్కీ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో, ఉమ్మడి ప్రయత్నాల ద్వారా శాంతిని ఎలా సాధించగలమో చర్చిస్తామని పేర్కొన్నారు. రష్యా సైన్యం రాత్రిపూట ఉక్రెయిన్‌లో లాజిస్టిక్స్ హబ్‌లు, గిడ్డంగులు, ఓడరేవులతో పాటు ఇతర సైనిక సంబంధిత ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

సోమవారం రాత్రి తమ వాయు రక్షణ వ్యవస్థలు రష్యా ప్రాంతాలు, నల్ల సముద్ర జలాలపై 244 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతలో, రాత్రిపూట జరిపిన దాడిలో 148 రష్యన్ డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. -----------------------------------ఈ వైమానిక దాడుల సమయంలో డ్రోన్లు పదేపదే పొరుగు దేశాల్లోకి ప్రవేశిస్తున్నాయి.

రష్యా పట్ల అప్రమత్తంగా ఉంటూ, సంఘర్షణలోకి లాగబడతామనే భయంతో ఉన్న మోల్డోవాలో దేశ నాయకులను ఇది కలవరపెడుతోంది. సోమవారం అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే తమ జాతీయ గగనతలంలోకి ఒక ‘డ్రోన్’ ప్రవేశించినట్లు నిఘా వ్యవస్థలు గుర్తించాయి. దీంతో దేశ ఉత్తర గగనతలంలోని కొంత భాగాన్ని రాత్రికి రాత్రే తాత్కాలికంగా మూసివేసినట్లు మోల్డోవా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రొమేనియా గగనతలంలోకి కూడా డ్రోన్ చొరబాట్లు గణనీయంగా పెరిగాయి.

మరిన్ని వార్తలు