దుర్గమను దర్శించుకున్న సీఎం విజయ్
విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్(Tamil Nadu CM C. Joseph Vijay) విజయవాడ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ(Kanaka Durgamma)ను ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విజయ్ సమావేశం కానున్నారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర నీటి పంపిణీ(Inter-State Water Sharing) అంశాలు, తెలుగు గంగ ప్రాజెక్టు, గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అనంతరం విజయ్ విజయవాడ ఉత్సవ్ 2.0(Vijayawada Utsav 2.0) కార్యక్రమంలో పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయన్న దానిపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.