నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై దుండగుల కాల్పులు
- అప్రమత్తం కావడంతో తప్పిన ప్రాణాపాయం
- టైగర్ కారు డ్రైవర్‌కు, ఓ ఆటోవాలాకు స్వల్ప గాయాలు
- దాడిపై సోషల్ మీడియాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పోస్టులు
- విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి ఫడ్నవిస్
- రంగంలోకి 12 ప్రత్యేక బృందాలు
- ముంబైలో కలకలం రేపిన ఘటన.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్ చిత్రపరిశ్రమ
ముంబై, అక్టోబర్ ౧౮: బాలీవుడ్ యువ నటుడు, యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్‌ను(Action star Tiger Shroff) లక్ష్యంగా చేసుకుని ముంబైలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి జుహు ప్రాంతంలోని పుష్ప పార్క్ సమీపంలో ఈ ఘోర దాడి చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. టైగర్ ష్రాఫ్ ఆదివారం సాయంత్రం జుహులోని ఒక మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లారు.
రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆయన తన బీఎండబ్ల్యూ కారులో ఇంటికి తిరుగుపయ నమయ్యారు. ఆ సమయంలో ఆయనను చూసేందుకు మైదానం వెలుపల భారీగా జనం గుమికూడారు. అదే జనాన్ని అడ్డుపెట్టుకుని, ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు అపరిచిత దుండగులు ఒక్కసారిగా టైగర్ ష్రాఫ్ వాహనంపైకి 3 నుంచి 4 రౌండ్లు విచక్షణారహి తంగా కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందో ళనలు రేగాయి.
టైగర్ ష్రాఫ్, అతని డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో నటుడికి ఎలాంటి బుల్లెట్ గాయాలు తగల్లేదు, ఆయన సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ దాడిలో టైగర్ కారు డ్రైవర్ ఫిరదౌస్ చేతికి, అలాగే అక్కడ ఉన్న మరో ఆటో డ్రైవర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీ పంలోని నానావతి ఆసుపత్రికి తరలించారు.
దాడికి బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..
ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్, హర్మాన్ సంధూ తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించారు. ‘ముంబై చిత్ర పరిశ్రమలో మా మాట వినకుండా, సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే ఎవరికైనా ఇదే గతి పడుతుంది’ అంటూ చిత్ర పరిశ్రమను హెచ్చరించారు. దాడి ఘటనపై ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ మోహిత్ గార్గ్ నిందితులను పట్టుకోవడానికి 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.