రవీంద్రభారతిలో వేపకాయల బతుకమ్మ

17-10-2026 | 05:40am

హాజరైన ప్రముఖులు, మహిళలు, కళాకారులు

ముషీరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు రవీంద్రభారతిలో శుక్రవారం ఏడో రోజు ‘వేపకాయల బతుకమ్మ’ పేరిట అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya), ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు(Hanumantha Rao), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయన సతీమణి సుజన, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, బీసీ సంఘం మహిళలు కలిసి రంగురంగుల బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.

ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో ఈ పండుగకున్న విశిష్టమైన ప్రాధాన్యతను వివరించారు. వేపకాయల ఆకారంలో ముద్దలు చేసి నైవేద్యంగా సమర్పించే సంబరాల్లో వివిధ వర్గాల మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాల కులు ఏనుగు నరసింహా రెడ్డి (ఐఏఎస్)శాఖ సిబ్బంది, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు