మూడు నెలల్లో రోహిత్ వేముల బిల్లు ముసాయిదా

17-10-2026 | 05:30am

క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి 

హాజరైన మంత్రులు పొన్నం, అడ్లూరి లక్మణ్

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల హక్కులను పరిరక్షిస్తూ, కులం, సామాజిక నేపథ్యం ఆధారంగా వివక్షకు తావులేకుండా సమగ్ర చట్టాన్ని రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’కు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను మూడు నెలల్లోగా సిద్ధం చేసి సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీ (సీఎస్సీ)కి సమర్పించాలని స్పష్టం చేశారు.

కమిటీ ఏర్పాటు నుంచి వివిధ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల వరకు ప్రతి దశను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాల సూచించారు. తెలంగాణ సచివాలయంలో శుక్రవారం భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రు లు పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), అడ్లూరి లక్మణ్‌కుమార్ హాజరయ్యారు. రోహిత్ వేముల తెలంగాణ బిల్లుపై సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీ రెండోసారి చర్చించారు. ప్రతిపాదిత బిల్లు రూపకల్పనకు అనుసరించాల్సిన విధానం, కమిటీ కూర్పు, న్యాయపరమైన అంశాలు, వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల హక్కులకు సమర్థవంత మైన రక్షణ కల్పించేలా చట్టాన్ని రూపొందించాలని భట్టి విక్రమార్క అన్నారు. 

మరిన్ని వార్తలు