ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్ ఆరుగురు మృతి
ప్రతికూల వాతావరణమే కారణమన్న అధికారులు
దర్యాప్తునకు ఆదేశించిన ఉత్తరాఖండ్ సీఎం ధామి
మృతులు బెంగుళూరుకు చెందినవారిగా గుర్తింపు
డెహ్రాడూన్, అక్టోబర్ 30: బద్రీనాథ్(Badrinath) నుంచి డెహ్రాడూన్‌కు వెళుతున్న హెలికాప్టర్(Helicopter) కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్‌తో సహా ఆ రుగురు మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పు ష్కర్సింగ్ ధామీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మధ్యాహ్నం 1.14 గంటలకు బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌లోని సహస్త్రధారకు ట్రాన్స్ భారత్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన విమానం వెళుతోంది. చమోలీలోని హాతీ పహాడ్ చాయీ గ్రామ స మీపంలో ప్రతికూల వాతావరణంతో కూలిపోయింది. హెలికాప్టర్ కూలిపోతుండగా స్థానికులు వీడియో తీసిన చిత్రాలు వార్తామాధ్యమాలు, సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే విపత్తు నిర్వాహణాధికారి నందకిషోర్ జోషి, చమోలీ జిల్లా ఎస్పీ సుర్జీత్ సింగ్ ఆధ్వర్యంలోని సహాయక బృందాలు రెండు హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చర్యలు చేపట్టా రు. జేపీ డ్యామ్‌కు ఎగువన అడవిలో విమాన శకలాలను గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలెట్ హిమాన్షుతో సహా ప్రయాణికులు ప్రతాప్, అరుణ్, శంకర్ గౌడ, సుధీర్, హెచ్. ఎస్. నటరాజ్‌లు మృతి చెందారని, వీరంతా బెంగుళూరుకు చెందినవారని అధికారులు ప్రకటించారు.
ప్రమాదం జరిగిన వెంటనే ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన మిగతా విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. ఘ టనా స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని వర్షాల కారణంగా ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదు జిల్లాల్లో ఆరెంజ్, నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను వాతావర ణ శాఖ జారీ చేసింది. కాగా గత ఐదేళ్లలో దే శవ్యాప్తంగా 12 హెలికాప్టర్ ప్రమాదాలు చో టు చేసుకొని 30 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్లో ప్రకటించింది.