దూషిస్తే తాటతీస్తాం
- మహిళా ప్రముఖులపై వ్యక్తిగత దాడులను సహించబోం
- రాజీలేని.. చట్టపరమైన కఠినచర్యలు తప్పవ్
- ప్రతిపక్షాలకు తమిళనాడు సీఎం విజయ్ హెచ్చరిక
- అసెంబ్లీలో మాజీ సీఎం జయలలిత, నటి త్రిష ప్రస్తావన
- టాస్మాక్ ‘కుంభకోణం’ను ప్రస్తావిస్తూ.. డీఎంకేపై తీవ్ర విమర్శలు
- గత ప్రభుత్వం ‘కరూర్ గ్యాంగ్’ పాలన చేసింది: సీఎం విజయ్
చెన్నై, సెప్టెంబర్ 7: మహిళలను దూషిస్తే తాటతీస్తామని ప్రతిపక్ష డీఎంకే(Opposition DMK)ను ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్(Tamil Nadu Chief Minister C. Joseph Vijay) తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దాడులు(Personal attacks), ద్వంద్వార్థ దూషణలు, లేదా అవమానకరమైన భాషను వాడడం.. వంటి వాటిపై తక్షణమే, రాజీలేని చట్టపరమైన పరిణామాలు ఉంటాయని గంభీరమైన స్వరంతో ఫైర్ అయ్యారు. మహిళా ప్రముఖులపై వ్యక్తిగత దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేస్తూ.. మాజీ సీఎం జయలలిత, నటి త్రిష పేర్లను ప్రస్తావించారు.
ప్రజామర్యాద, రాజకీయ నైతిక విలువలపై ‘నా వైఖరి స్పష్ట’మని తెలిపారు. టాస్మాక్ ‘కుంభకోణం’ను ప్రస్తావిస్తూ.. డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభు త్వం ‘కరూర్ గ్యాంగ్’ పాలన చేసిందని, ఈడీ నివేదికలో ఉన్నదే మాట్లాడుతున్నాని సీఎం విజయ్ తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో సోమవారం సీఎం విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుదుమారాన్ని రేపుతుతున్నాయి. ప్రస్తుతం త్రిష వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎదుర్కొన్న అవమానాల ను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. మహిళా ప్రముఖులకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో జరుగుతున్న వ్యక్తిగత దాడులను ఆయన ఖండించారు. ప్రజామర్యాద, రాజకీయ నైతిక విలువలపై తన వైఖరి స్పష్టం చేశారు. గంభీరమైన స్వరంతో ఇద్దరు ప్రముఖ మహిళా నాయకు లైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత, నటి త్రిషను ప్రత్యక్షంగా, పరోక్షం గా ప్రస్తావించారు.
ప్రజా జీవితంలోని మహిళలపై జరుగుతున్న వ్యక్తిగత, అసభ్యకరమైన దాడులను విజయ్ పరోక్షంగా తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో తన ఉద్వేగభరితమైన, దృఢమైన ప్రసంగంలో విజయ్, మహిళల గౌరవ మర్యాదలకు తన ప్రభుత్వ అజెండాలో అగ్రస్థానం కల్పించారు. ప్రజా స్వామ్యంలో కఠినమైన రాజకీయ విమర్శలను స్వాగతించినప్పటికీ, మహిళలపై వ్యక్తిగత దాడులను ఎన్నటికీ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘నా రాజకీయ విజయానికి ప్రధాన కారణం మహిళలే’ అని సీఎం విజయ్ తెలిపారు.
‘ఎముక లు విరగ్గొడతాం’ వంటి శారీరక బెదిరింపుల తో కూడిన వ్యాఖ్యలను ఆయన ఖండించా రు. ప్రజాస్వామ్య తీర్పు పట్ల అగౌరవాన్ని ప్రదర్శించే ప్రకటనలను తప్పుబట్టారు. అంతర్గత భద్రతా పరిరక్షణ చట్టం (మిసా)తో సహా చారిత్రక రాజకీయ మైలురాళ్లను ప్రస్తావించారు. ‘అబ ద్ధాలు మాట్లాడటం, డబ్బు తీసుకోవడం, సంచులు మోయడం... ఇలా డీఎంకే ప్రవర్తనను దిగ్గజ తమిళ కవి, గేయ రచయిత కన్నదాసన్ వర్ణించారు’ అని విజయ్ అన్నారు.
డీఎంకేపై టాస్మాక్ ‘కుంభకోణం’ అస్త్రం
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం విక్రయ సంస్థ టాస్మాక్‌లో జరిగిన అవినీతిపై సీఎం విజయ్ గత డీఎంకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకు న్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ వెల్లడించిన వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీలో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పత్రాల ను చదువుతూ, 2021 నుంచి 2025 మధ్య కాలంలో ‘కరూర్ గ్యాంగ్’గా పిలవబడే ఒక ‘సంఘటిత నేర ముఠా’ అక్రమ వసూళ్లు, టెండర్ల అవకతవకలు, చట్టవిరుద్ధ బదిలీల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా ఆయుధంగా వాడుకుందో ఆయన వివరించారు.
కరూర్, కోయం బత్తూరు ప్రాంతాల లో ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్ పనిచేస్తూ, ‘మద్యం వినియోగదారుల నుంచి క్రమపద్ధతిలో అదనపు నగదును వసూలు చేసిందని, స్థానిక బార్ యజమానులను బెదిరించిందని’ ఆయన ఆరోపించారు. ‘దేవుడు, ప్రకృతి, ప్రజలు ఎల్లప్పుడూ మన పక్షాన ఉంటారు’ అని ఆయన ప్రకటించారు. ప్రజల పరిశీలన, సమగ్ర అవినీతి వ్యతిరేక విచారణల ముందు ప్రతిపక్షం పన్నే రాజకీయ ఎత్తుగడలు చివరికి విఫలమవుతాయని ఆయన స్పష్టం చేశారు.