బాలుడు అదృశ్యం

03-10-2026 | 08:15pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఓ 15 సంవత్సరాల బాలుడు అదృశ్యమైన(Boy Missing) సంఘటన ఘట్కేసర్(Ghatkesar) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఘాజీపూర్ జిల్లా, బరుయిన్ గ్రామానికి చెందిన భరత్ రామ్  సుమారు 15 రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి బతుకుదెరువు నిమిత్తం ఎదులాబాద్‌లోని ఉమామహేశ్వర మిల్ బోర్డ్(Umamaheswara Mill Board) (అట్టల తయారీ కంపెనీ)లో పనిచేయడానికి వచ్చారు.

ఈనెల 2న (శుక్రవారం) సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కంపెనీలో పని జరుగుతుండగా భరత్ రామ్ పెద్ద కుమారుడు ఆకాష్ కుమార్ (15) పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్తున్నానని తోటి కార్మికుడైన రాహుల్‌‌తో చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ బాలుడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. సదరు బాలుడికి మానసిక స్థితి సరిగా లేదని తండ్రి పేర్కొన్నారు. బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు