5 September, 2026 | 11:54 PM

వాహన తనిఖీల్లో 174 మంది పట్టివేత

05-09-2026 | 09:38pm

- రూ.5.76 లక్షల జరిమానా

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు(Siddipet Traffic Police) ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 174 మంది పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు(Siddipet Traffic CI Mutyam Raju) తెలిపారు. వారిలో 99 మంది మద్యం తాగి, 75 మంది లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతుండగా పట్టుకొని కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శనివారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు. న్యాయమూర్తి విచారణ జరిపి డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులకు రూ.3 లక్షల 45 వేల 5 వందలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి రూ.2 లక్షల31 వేలు జరిమానా విధించినారని సీఐ ముత్యంరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు