నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ రాజేష్‌చంద్ర
దోమకొండ,(విజయ క్రాంతి): నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టి ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్‌చంద్ర(SP M. Rajeshchandra,) ఆదేశించారు. శనివారం దోమకొండ పోలీస్‌స్టేషన్(Domakonda Police Station)ను వార్షికంగా తనిఖీ చేసిన ఆయన రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ వ్యక్తులపై నిఘా పెంచి పెట్రోలింగ్, బీట్ వ్యవస్థను ముమ్మరం చేయాలన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారులు, వృద్ధుల సమస్యలపై సున్నితంగా స్పందించాలని సూచించారు. రానున్న గణేష్ ఉత్సవా(Ganesh Festival)ల సందర్భంగా ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్, సీఐ నరేష్, ఎస్‌ఐ ప్రభాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






