అకస్మాత్తుగా మంటలు... దగ్ధమైన కారు
23-09-2026 | 11:18pm
- విక్టోరియా మెమోరియల్ స్కూల్ సమీపంలో ఘటన
ఎల్బీనగర్, సెప్టెంబర్ 23: సరూర్నగర్ పోలీస్ స్టేషన్(Saroornagar Police Station) పరిధిలో ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, కారు దగ్ధమైన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మెట్రో పిల్లర్ నంబర్ 1644 వద్ద ఎల్బీనగర్–దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న VOLKSWAGEN POLO కారు(ఏపీ09సీపీ6421)లోని ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో కారులో ఒక్కరే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.