జీవన సమరానికై వీధికెక్కిన బాల్యం

13-09-2026 | 05:20am
  1. పస్తులు ఉండలేక పనికోసం కొబ్బరి కుడుకల వ్యాపారం
  2. పొట్టకూటి కోసం జవహర్‌నగర్ వలస పేదల జీవన పాట్లు

జవహర్‌నగర్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): జీవన సమరంకై... కొబ్బరి కుడుకల వ్యాపారం(Dry coconut business) చేసుకుంటూ సగం పూట పస్తులు ఉంటూ... దూర ప్రాంతాలైన ఆంధ్ర తెలంగాణ(Andhra Telangana) నుండి హైదరాబాదు(Hyderabad)లోని జవహర్ నగర్(Jawahar Nagar)కు వలస వచ్చారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వా రిని. కొబ్బరి కుడుకలు అమ్ముకునే జీవించే వారి జీవితం చాలా శ్రమతో ఒడి దొడుగులతో  కూడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల(Rural areas) నుండి పట్టణాల వరకు ఎంతో మంది చిన్న వ్యాపారులు వీధి వ్యాపారాలు ఈ వృత్తిపైనే ఆధారపడి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.            

కఠినమైన శ్రమ తెల్లవారుజాము నుండి ప్రారంభం

 వీరు తెల్లవారుజాము నుండి లేచి ప్రతి బజారు వీధుల వెంబడి తిరుగుతూ కొబ్బరి కుడుకలను కొనుగోలు చేస్తారు. వీరి జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. తాము నమ్ముకున్న వృత్తిని గౌరవిస్తూ కష్టపడి పనిచేసి పిల్లలను చదివించుకుంటున్నారు. సమాజంలో వీరికి పెద్దగా గుర్తింపు లేకపోయినా ప్రతి ఇంట్లో జరిగే వివిధ రకాల పూజలు మిగిలిపోయిన కొబ్బరి కుడుకలను సేకరించుకొని అమ్మి జీవితాన్ని కొన సాగిస్తున్నారు.

వీరి శారీరక శ్రమ రోజంతా ఎండనకా వాననకా సైకిల్ మీద వెళ్లి వీధి వీధి తిరుగుతూ అలసట అయ్యేంతవరకు తిరిగి సేకరించిన కొబ్బరి కుడుకలను తెచ్చి మార్కెట్లో అమ్మితే వీరికి మిగిలేది కొంచమే. అ యినా వీరు తమ వ్యాపారాన్ని యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఆదాయంలో అస్థిరత వీరు రోజు ఉదయం నుం చి సాయంత్రం వరకు తిరిగినా రోజువారీ ఖర్చులకు సరిపడా ఆదాయం రావడం కూడా గగనమే అవుతుంది. 

వ ర్షాకాలంలో కొబ్బరికాయలను కొబ్బరి కుడుకలను ఎ ండబెట్టడం చాలా కష్టం తేమ వల్ల కుడకలు బూజు పట్టి పాడైపోతే వారికి భారీ నష్టం వస్తుంది. అసలే సీజన్లో వ్యా పారాలు లేక అల్లాడుతుంటుంటే, పిల్లలను కూడా ఈ వ్యాపారులు ఈ వృత్తిలోకి దింపుతూ తమ బడి ఈడు బాల్యాన్ని వ్యర్థ పరుస్తున్నారు. పేదరికానికి తోడు తమ జీవన  భృతి కై తమ పిల్లలను కూడా ఈ కొబ్బరి కుడక ల వ్యాపార వృత్తిలోకి దించుతున్నారు. ఈ బాలలు కొ బ్బరి కుడకల సేకరణకై రోజు ఉదయాన్నే సైకిల్ మీద ఎండనకా వాననక తిరుగుతూ కొబ్బరి కుడుకలను సేకరించి తమ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తు న్నారు. 

 తెలంగాణ ప్రభుత్వం వీధి వ్యాపారులను ము ఖ్యంగా కొబ్బరి కుడుకలను సేకరించుకొని జీవించే వారికోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టి వారి సర్వతో ము ఖాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నారు. ఆపరేషన్ ముస్కాన్ పథకం కింద పిల్లలను బడికి పంపి వారికి తగిన విద్యా సౌకర్యాలను కల్పించి విద్య హక్కు చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరికీ ఉచిత విద్య కల్పించాలని జవహర్‌నగర్ ప్రజలు కోరుకుంటున్నారు.

స్కూలుకెళ్లాలని ఆశగా ఉంది.. 

నా పేరు సతీష్ మాది ఆలేరు దగ్గరలోని ఒక కుగ్రామం. పొట్టకూటికోసం అమ్మానాన్నలతో హైదరాబాదులోని జవహర్ నగర్ కు వచ్చాము. మాకు ఇల్లు గడవడం కష్టంగా ఉంది. నాన్న ఆదేశంతో ఉదయమే కొబ్బరి కుడుకల సేకరణకై సైకిల్ మీద ప్రతి వీధి వీధినా తిరిగి పంచదార ఇచ్చి కొబ్బరి కుడుకలను సేకరిస్తా.  

 సతీష్, కొబ్బరి కుడుకలు సేకరించే బాలుడు, జవహర్‌నగర్

ప్రత్యామ్నాయ మార్గాలు చూపండి

పని కోసం హైదరాబాద్ వచ్చాము. ఇక్కడ ఏ పనులు సరిగ్గా దొరకటం లేదు. విధి లేని పరిస్థితుల్లో కొబ్బరి కుడుకల వ్యాపారం లోకి దిగాం. సేకరించి తెచ్చిన పగిలిన కొబ్బరికాయల కుడుకలను కొబ్బరి చిప్పల నుండి వేరుచేసి హోల్ సేల్ వ్యాపారులకు అమ్మినా గాని రోజు కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వ మమ్మల్ని ఆదుకోవాలి. 

 నాగరాజు, ప్రగతినగర్

మరిన్ని వార్తలు