చీకటి రోజు రణరంగం
అసెంబ్లీ పరిసరాలు ఉద్రిక్తం.. తాతా మధు వ్యాఖ్యల దుమారం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల(Telangana Assembly Monsoon Sessions) తొలిరోజే అధికార(Authority), ప్రతిపక్షాల(opposition parties) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. చలో అసెంబ్లీ(Assembly) అంటూ బీజేపీ(BJP), విద్యార్థి సంఘాలు(Student Unions) ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) వెయ్యి రోజుల పాలనలో హామీల అమలు వైఫల్యాలను ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు(BRS MLAs and MLCs) నల్ల టీషర్టులు, నల్ల చీరలు(Black T-shirts, black sarees) ధరించి గన్‌పార్క్(Gun Park) వద్ద నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు(Police) అడ్డుకోవడంతో అసెంబ్లీ గేటు వద్ద బాహాబాహీ జరిగింది.
మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao)తోపాటు పలువురు బీఆర్‌ఎస్ సభ్యులు టీ షర్ట్ విప్పి నిరసన తెలిపారు. తోపులాటలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ సహా పలువురికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
తీవ్ర భావోద్వేగానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. స్పీకర్‌పై జరిగిన అవమానం సభ్య సమాజానికి జరిగిన అవమానమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ గేటు వద్ద మొదలైన బీఆర్‌ఎస్ ఆందోళన.. అరెస్టులు, పోలీసుల తీరుపై ఆరోపణలు, గాయాలు, తాతా మధు వ్యాఖ్యలు, స్పీకర్ కన్నీరు, కాంగ్రెస్ ఎదురుదాడి వరకు దారితీసిన పరిణామాలు సంచలనంగా మారాయి.
