హబ్సిగూడ చౌరస్తాలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలి
నాచారం ఉప్పల్ వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం కోరిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, సెప్టెంబర్ 5 విజయ క్రాంతి: నా చారం నుండి ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు హబ్సిగూడ చౌరస్తా (Habsiguda Crossroads) వద్ద తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అక్కడ ప్రత్యేక ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Uppal MLA Bandari Lakshma Reddy) కోరారు.హబ్సిగూడ చౌరస్తా వద్ద నాచారం, ఉప్పల్, తా ర్నాక మార్గాల్లో భారీగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయని, సిగ్నల్ పడిన ప్రతిసారి వాహనదారులు 10 నుంచి 12 ని మిషాల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే తెలిపారు.
ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో హబ్సిగూడ నుంచి హెచ్‌ఎంటీ నగర్ కమాన్ వరకు ట్రా ఫిక్ నిలిచిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యేక ఫ్రీ లెఫ్ట్ లేకపోవడంతో, తార్నాక వైపు వెళ్లే వాహనాలతో కలి సి సిగ్నల్ కోసం నిరీక్షించాల్సి వస్తోందని, దీ ని వల్ల ట్రాఫిక్ రద్దీ మరింత పెరుగుతోందన్నారు.ఈ సమస్య పరిష్కారానికి హబ్సిగూ డ చౌరస్తాలో ఫ్రీ లెఫ్ట్కు అడ్డుగా ఉన్న పురాతన భవనాన్ని తొలగించి, రోడ్డును విస్తరించి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలకు ప్ర త్యేక ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎంఎంసీ కమిషనర్ విన య్ కృష్ణారెడ్డిని కోరారు.
అలాగే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్లు ఆక్ర మణలకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని గుర్తించి వెంటనే తొలగించి వాహనదారులకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే సూచనలపై స్పందించిన ఎంఎంసీ కమిషనర్ విన య్ కృష్ణారెడ్డి, నియోజకవర్గంలోని ఫ్రీ లెఫ్ట్ల ను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్ర మంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, విఠల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.






