6 September, 2026 | 11:58 AM

రైస్ మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలి

06-09-2026 | 10:32am

కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పప్పుల రాజేంద్రప్రసాద్ 

కామారెడ్డి,(విజయక్రాంతి): రైస్ మిల్లర్ సమస్యపై ప్రభుత్వం చొరవ చూపాలని కామారెడ్డి జిల్లా(Kamareddy District) రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు పప్పుల రాజేంద్రప్రసాద్ కోరారు. శనివారం కామారెడ్డి రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం మిల్లింగు, బియ్యం అప్పగింతపై ప్రభుత్వం గడువు ఇచ్చిందని ఆ గడువులోగా బియ్యం ప్రభుత్వానికి అందిస్తామని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇప్పటికే మిల్లర్లతో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేందుకు మిల్లర్లు సుముఖంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం మిల్లర్లపై పదేపదే ఒత్తిడి చేయవద్దని తెలిపారు. నిజా నిజాలను పరిశీలించాలని కోరారు. మిల్లర్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సహకరించాలన్నారు. మిల్లింగ్ వ్యవస్థ పై ఒత్తిడి తగ్గించాలని కోరారు. నిజా నిజాలను పరిశీలించి మిల్లర్లకు సహకారం అందించాలన్నారు.

మరిన్ని వార్తలు