‘ఫ్యూచర్ సిటీ’ నియోజకవర్గం?

22-09-2026 | 05:25am
  1. కదిలిపోనున్న మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి సరిహద్దులు
  2. రేవంత్ విజన్.. కిషన్ రెడ్డి ఫోకస్
  3. ఫ్యూచర్ సిటీ’పై గులాబీ, కమల, హస్తం మార్క్

రంగారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన(Delimitation of Assembly constituencies) (డీలిమిటేషన్) ప్రక్రియ రంగారెడ్డి జిల్లా రాజకీయ రూపురేఖలను మార్చబోతోంది. తెలంగాణ స్థానాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ’భారత్ ఫ్యూచర్ సిటీ(India Future City)’ కేంద్రీకృతంగా ఒక కొత్త అసెంబ్లీ నియోజకవర్గం రూపుదిద్దుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వయంగా విజన్ ప్రాజెక్ట్గా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి పాలనాపరంగా, రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యం కల్పించేందుకే ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఏ మండలాలు కలవనున్నాయి?

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న డ్రాఫ్ట్ నోటిఫికేషన్(Draft Notification) కథనాల ప్రకారం... ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే పరిసర ప్రాంతాలను సమగ్రంగా ఒకే గొడుగు కిందకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో ని యాచారం మండలం, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన కొన్ని కీలక గ్రామాలు (ఎలిమినేడు, కప్పపహాడ్, తూలేకలాన్ రెవెన్యూ గ్రామా లు, కందుకూరు మండలం లో ని ముచ్చర్ల, మీర్ఖాన్పేట్, లేమూర్, దాసర్లపల్లి, రాచలూ రు సహా పరిసర ప్రాంతాలు,మహేశ్వరం మండలం లో ని ఫ్యూచర్ సిటీ ఐటీ, గ్రీన్ ఫార్మా రూట్లకు అనుసంధానంగా ఉన్న గ్రామాలు.

కడ్తాల్ మండలంలోని ముద్విన్, ఎ క్వాయి పల్లి, మర్రి పల్లి,ఆమనగల్ మండలం లో ని కోనాపూర్, సీతారాంనగర్ తండా, ఆకుతోటపల్లి, సింగంపల్లి, చెన్నంపల్లి శ్రీశైలం హైవే కారిడార్లోని మరికొన్ని గ్రామాలు తో పాటు పరిసర గ్రామాలు మండలాలను విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా గ్రామా లతో ఫ్యూచర్ సిటీ’ నియోజకవర్గాన్ని ఏర్పా టు చేస్తే పాలన సజావుగా సాగడమే కాకుం డా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికీ బూస్ట్ దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

సీఎం ప్రత్యేక ఫోకస్

గత రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై ప్రత్యే క దృష్టి సారించారు. ప్రపంచంలోనే మేటి నగరాలైన జపాన్ లోని టోక్యో, సింగపూర్, న్యూయార్క్ నగరాలతో పోటీపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ ), గ్రీన్ ఫార్మా, ఎడ్యుకేషన్, స్పోరట్స్, అడ్వానస్డ్ డాటా సెంట ర్ల హబ్గా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఫ్యూచర్ సిటీ కి కల్పిస్తే పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడులకు వేగవంతమైన అనుమతులు లభిస్తాయని, ప్రత్యేక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉండటం వల్ల బడ్జెట్లో మౌలిక వసతులకు వేల కోట్ల నిధులు నేరుగా కేటాయించవచ్చని,ప్రతిపాదిత మెట్రో కారిడార్, 300 అడుగుల గ్రీన్ ఫీల్ రేడియల్ రోడ్ల నిర్మాణం వేగవంతమవుతుందని ప్రభుత్వం దూరదృష్టితో ఇక్కడే దృష్టి పెట్టింది.

మారనున్న రాజకీయ సమీకరణాలు

ఫ్యూచర్ సిటీ కొత్త నియోజకవర్గంగా ఏ ర్పడితే రంగారెడ్డి జిల్లా రాజకీయంలో పెను మార్పులు ఖాయం.పాత నియోజకవర్గాల సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు తమ పరిధిలోని ప్రధాన భూభాగాలను, ఓటు బ్యాంకును కోల్పోవలసి వస్తుంది. అన్ని రాజకీయ పార్టీలో యువ నాయకత్వానికి అడుగులు పడే అవకాశాలను ఉన్నాయి. రం గారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, ఇతర పార్టీలలోని ద్వితీయ శ్రేణి నాయ కులకు ఇది ఒక పెద్ద అవకాశంగా మారనుంది.

కీలక నేతల దృష్టి

 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య డీలిమిటేషన్ పరిణామాలపై చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే తుది డ్రాఫ్ట్పై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే వార్తలు సైతం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. కందుకూరు మండలం తిమ్మా పూర్ గ్రామంలో ఈనెల 17న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన స్వగ్రామం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్, సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లు తెలంగాణ వి మోచన, విశ్వకర్మ జయంతి, ప్రధానమంత్రి జన్మదిన వేడుకలతో పాటు, ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదే వేడుకలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామం తిమ్మాపూర్ పరిసర ప్రాంతాల్లో రూ. 17 కోట్ల తో రహదారి పను లు, శ్రీశైలం రోడ్డు నుంచి లేమూరు, అగ్రిమల, అవనిగడ్డ, తిమ్మాపూర్ మీదుగా సు మారు రూ. 38 కోట్లతో (మొత్తం రూ. 55 కోట్లు) ఆధునిక రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం వెల్లడించారు. 

దీంతో ఈ ప్రాంతం రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందనే వీరు చేస్తున్న అభివృద్ధి పనులే అందుకు ఊతమిస్తున్నాయి.దీంతో ఫ్యూచర్ సిటీ ప్రత్యేక నియోజకవర్గ కేంద్రం ఏర్పడితే... రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ పార్టీ సైతం ఈ నియోజకవర్గం పై పట్టు సాధించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు.ఫ్యూచర్ సిటీ కేవలం ఆర్థిక, పారిశ్రా మిక హబ్గానే కాకుండా... రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాన్ని శాసించే ప్రధాన శక్తి కేంద్రంగా మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు