చిన్న వినాయకుడు.. గొప్ప సందేశం

24-09-2026 | 03:25pm
  1. పర్యావరణ పరిరక్షణకు ఓం శివశక్తి యూత్ వినూత్న నిర్ణయం
  2. మూడు ఫీట్లలోపే వినాయకుడు
  3. వినాయకుని ఎత్తు కాదు భక్తి మాత్రమే ప్రధానమని అంటున్న యువత

సదాశివపేట, సెప్టెంబర్ 24:వినాయక చవితి(Vinayaka Chavithi) సందర్భంగా భారీ విగ్రహాల ఏర్పాటుకు భిన్నంగా పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఓం శివశక్తి యూత్ సభ్యులు(Shivashakti Youth members) చిన్న వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. సదాశివపేట తిలక్ రోడ్డులోని బసవేశ్వర ఆలయం సమీపంలో 2015లో చిన్న గల్లీలో ప్రారంభమైన ఈ యువజన సంఘం, గత ఐదేళ్లుగా ప్రధాన రహదారి పక్కన షెడ్ ఏర్పాటు చేసుకుని వినాయక ఉత్సవాలను కొనసాగిస్తోంది.

ఈ ఏడాది నీటి కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో చిన్న పరిమాణంలోని వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ నిమజ్జనం వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యువత తెలిపారు. వినాయకుడి భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణపై కూడా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. సదాశివపేట లోనే  తమ చిన్న వినాయక విగ్రహం ప్రత్యేక సందేశాన్ని ఇస్తుందని, తమను చూసి మరికొందరు కూడా పర్యావరణహిత పద్ధతులను పాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యువత సభ్యులు మర్రి భరత్, గౌన్ల సతీష్, తమ్మాలి అఖిల్, దుద్దల లక్ష్మీరాజ్ (సోను), దుద్దల విశాల్, శెట్టి రిషి, మోట్లకుంట ప్రజ్వల్, దేశెట్టి శివచరణ్, హరీష్ గౌడ్, సాయి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు