డ్రైనేజీ సమస్యకు పరిష్కార మార్గం
21-09-2026 | 08:13pm
మాట్లాడుతున్న ఉపసర్పంచ్ దీపక్ ముండే
వాంకిడి, (విజయ క్రాంతి) : స్థానిక మండల కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో నెలకొన్న మురికికాలువ సమస్యపై స్థానిక ఉపసర్పంచ్ దీపక్ ముండే(Local Deputy Sarpanch Deepak Munde) ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి శివ కుమార్ తో కలిసి ఆయన ఇందిరా నగర్ కాలనీలో పర్యటించి సమస్యను పరిశీలించారు.
మురుగునీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం కోసం మురికికాలువ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించినట్లు ఉపసర్పంచ్ తెలిపారు. కాలనీ ప్రజల ఇబ్బందులను గుర్తించి సమస్య పరిష్కారానికి చొరవ చూపడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.