నవంబర్‌లోనే ఆకాశంలో ఒకతార
18-09-2026 | 05:20am
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజాచిత్రం ‘ఆకాశంలో ఒకతార’(aakasamlo okathara). దుల్కర్‌తోపాటు ఈ సినిమాలో సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకుడు. లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న .
ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఈ మూవీని నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ గురువారం ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్; సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్; ప్రొడక్షన్ డిజైన్: శ్వేత సాబుసిరిల్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్.