మరకతమణి 2 మెరుగులద్దుకుంటోంది!

03-10-2026 | 05:05am

ఆది పినిశెట్టి(Aadhi Pinisetty) హీరోగా నటించిన ‘మరకతమణి(Maragathamani)’ చిత్రం 2017లో విడుదలైన తమిళం, తెలుగు భాషల్లో(Tamil and Telugu languages) మంచి విజయాన్ని అందుకుకుంది. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. ‘మరకతమణి 2’ పేరుతో పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఏఆర్‌కే శరవణ్ ఈ ఫ్రాంచైజీకి కొనసాగుతున్నారు.

ప్యాషన్ స్టూడియోస్, డాంగల్ టీవీ, ఆర్డీసీ మీడియా, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, గుడ్ షో బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. సుధన్ సుందరం, మనీష్ సింగాల్, దుర్గారామ్ చౌదరి, దేవ్, కేవీ దురై నిర్మాతలు. తాజాచిత్రంలో ఆదితోపాటు సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, నిక్కీ గల్రాణి పినిశెట్టి, మునీశ్‌కాంత్, ఆనంద్‌రాజ్, డానియే, అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ధీబు నినన్ థామస్ సంగీతం అందిస్తుండగా.. పీవీ శంకర్, దీపక్ మీనన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రాజేశ్ కన్నన్ సంభాషణలు రాయగా, పీసీ స్టంట్స్ కొరియోగ్రఫీని, ఎన్కే రాహుల్ ఆర్ట్‌ను, తిరుమలై రాజన్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ మరిన్ని అప్డేట్స్‌ను వెల్లడించనున్నారు. 

మరిన్ని వార్తలు