తూప్రాన్ ప్రధాన రోడ్డుపై ప్రమాదం
21-09-2026 | 07:16pm
తూప్రాన్,(విజయ క్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్ నుండి బయటకు వస్తున్న సంగారెడ్డి డిపో పల్లె వెలుగు బస్సు అల్లాపూర్ మన్నే నాగరాజును ఢీకొట్టగా మొకాలికి తీవ్ర గాయం అయింది. సమీపస్తులు అంబులెన్స్ కు ఫోన్ చేయగా అంబులెన్స్ లో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తూప్రాన్ ప్రధాన రహదారి చిరు వ్యాపారస్తులతో రద్దీ ఇరుకుగా ఏర్పడి పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం కలుగగా ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది.