మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

18-09-2026 | 05:10am
  1. మద్యం విషయంలో తరచూ గొడవలు.. నైలాన్ తాడుతో హత్య 
  2. వివరాలు వెల్లడిస్తున్న ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్ రెడ్డి, సీఐ రమేశ్

ఆదిభట్ల, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ శ్రీపురం కాలనీలో జరిగిన మహిళ హత్య కే సును (Femicide case) పోలీసులు ఛేదించారు. కేసులో నిందితుడైన దాసరి నరసింహమూర్తి (35)ని గు రువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించా రు. ఈ మేరకు ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్కుమార్రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో కేసు వివరాలను వెల్లడించారు.విశాఖపట్నం జిల్లా వేపగుంట వరలక్ష్మినగర్కు చెందిన నరసింహమూర్తి నాదర్గుల్ శ్రీపురం కాలనీలో నివాసముంటూ హాస్టల్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నాడు.

ప్రకాశం జిల్లా కొండెపి మండలం పెట్లూరు గ్రామానికి చెందిన కొ ర్రపాటి కళ్యాణి (37)తో ఏడాదిగా సహజీవ నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నరసింహమూర్తి తరచూ మద్యం సేవించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని పేర్కొన్నారు.ఈ నెల 13న రాత్రి జరిగిన గొడవలో నైలాన్ తాడుతో కళ్యాణి మెడకు బిగించి ఊ పిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తు లో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేం దుకు సంఘటనా స్థలంలోని ఆధారాల ను మార్చే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.

మృతురాలి ఫోన్ నుంచి ఆమె భర్తతో పా టు ఇతరులకు తప్పుడు సమాచారం పంపి, అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.కాగా, ఈ నెల 15న కళ్యాణి ఉంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానించి ఆదిభట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కు టుంబసభ్యులకు సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు క్రైమ్ నం.759/ 2026, బీఎన్‌ఎస్ 103(1) కింద కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో నిందితుడిని గుర్తించిన పోలీసులు గురువా రం ఉదయం నాదర్గుల్లో అరెస్ట్ చేశారు. కేసు ను ఛేదించడంలో కీలకంగా పనిచేసిన ఎస్హెచ్‌ఓ ఎస్. రమేశ్, ఎస్‌ఐలు డి. వెంకటేశ్, నో యల్ రాజ్, క్రైమ్ సిబ్బంది పి. ఎల్లయ్య, సం తోష్కుమార్, ఎం.డి. సంతోష్, శివచంద్ర, సందీప్, ఉపేందర్రెడ్డిలను శంషాబాద్ డీసీపీ అభినందించారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


మరిన్ని వార్తలు