గణేష్ ఉత్సవాల్లో భద్రతా నిబంధనలు తప్పనిసరి
నాచారం సీకే గార్డెన్స్‌లో పోలీసుల సమన్వయ సమావేశం
ఉప్పల్ , సెప్టెంబర్ 12విజయ్ క్రాంతి : గణేష్ ఉత్సవాల నిర్వహణ(Organization of Ganesh festivities), నిమజ్జన ఊరేగింపుల(Immersion procession) నేపథ్యంలో నాచారం సీకే గార్డెన్స్లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. కన్వీనర్ బాలకృష్ణ(Convener Balakrishna) ఆధ్వర్యంలో జరిగి న ఈ సమావేశానికి నాచారం సీఐ ధనుంజయ గౌడ్, డీఐ మాన్సింగ్, ఎస్‌ఐ మైబెల్లి, ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అనిత పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ ధనుంజయ గౌడ్ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
విద్యుత్ కనెక్షన్లు, అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. నిమజ్జన ఊరేగింపుల సమయంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని, నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.