ఆదివరాహ స్వామి హుండీ లెక్కింపు

09-09-2026 | 06:54pm

భక్తుల కానుకల లెక్కింపు.. పాల్గొన్న ఆలయ చైర్మన్, ఈవో, ప్రజాప్రతినిధులు

కమాన్‌పూర్,(విజయక్రాంతి): కమాన్‌పూర్ మండల(Kamanpur Mandal) కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ ఆదివరాహస్వామి ఆలయానికి(Sri Adivarahaswamy Temple) భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.6,53,959 హుండీ ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కొసనకాంతరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆలయ కల్యాణ మండపంలో హుండీలను తెరిచి లెక్కింపు చేపట్టారు. ఇటీవల నిర్వహించిన స్వామివారి జయంతి ఉత్సవాలతో పాటు శ్రావణమాసం(Sravana Masam)లో ఆలయాన్ని సందర్శించిన భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.6,53,959 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎస్సై కొట్టే ప్రసాద్, స్థానిక సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, ఆలయ డైరెక్టర్లు తీగల రాజయ్య, పిల్లి రాజు, సాగి శ్రీనివాసరావు, మల్యాల మల్లేష్, గాజుల శ్రీనివాస్, భద్రపు శంకర్, చాట్ల రాయమల్లు, కొంతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు