వినాయక చవితి ఏర్పాట్లపై మున్సిపల్ చైర్పర్సన్ సమీక్ష

09-09-2026 | 07:35pm

భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చూడాలి 

మున్సిపల్ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలి 

మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ 

కామారెడ్డి, సెప్టెంబర్ 9(విజయక్రాంతి): వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు (Municipal officials)చర్యలు చేపట్టాలని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. బుధవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వినాయక మండపాల్లో వినాయకుల నెలకొల్పడం, వినాయకుని నిమజ్జన శోభాయాత్ర సమయాల్లో భక్తులకు అసౌకర్యం కలవకుండా చూడాలన్నారు.

పారిశుద్ధ్య  సమస్య తలెత్తకుండా మున్సిపల్  అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల సౌకర్యం భద్రతకు ప్రథమ ప్రాధాన్యత నేస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, తాసిల్దార్ హిమబిందు, పట్టణ సిఐ నరహరి, పట్టణ ఎస్ఐ లు, విద్యుత్ శాఖ అధికారులు, కౌన్సిలర్ షేర్, ప్రభాకర్ యాదవ్, లోలపు శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు