మోడల్ స్కూల్లో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
మఠంపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ(Telangana Model School and Junior College)లో బుధవారం తెలంగాణ భాషా దినోత్సవ వేడుకల(Telangana Language Day celebrations)ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి(Kaloji Narayana Rao Jayanthi)ని పురస్కరించుకుని పాఠశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, సౌజన్యల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బి.శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ భాషా పరిణామ క్రమాన్ని,దాని విశిష్టతను వివరించారు. మన యాస,మన భాష మన సంస్కృతికి ప్రతిబింబాలని, ప్రతి ఒక్కరూ మాతృభాషను గౌరవించి, దాని ప్రాముఖ్యతను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు తెలుగు పద్యాల పోటీలు,వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.