ఆదివాసీ చట్టాల పరిరక్షణకై ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించాలి

21-09-2026 | 06:58pm

మాజీ ఎంపీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మిడియం బాబురావు డిమాండ్.

ములకలపల్లి,సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఆదివాసీ చట్టాల పరిరక్షణకు ఆదివాసీలందరూ ఐక్యంగా ఉద్యమించాలని మాజీ ఎంపీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మిడియం బాబురావు(Dr. Medium Baburao) పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని సుందరయ్య నగర్ గ్రామంలోని ఓ పంక్షన్ హాల్ లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సన్నాహాక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ హక్కులను హరిస్తుందని అన్నారు.గ్రామీణ ప్రాంత ఆదివాసీ యువత ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న ఆదివాసీ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిఓ నెంబర్ 3ని ప్రభుత్వం వెంటనే పునరుద్ధించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీ పోడు సాగు దారులపై ఫారెస్టు అధికారుల దాడులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆదివాసీ అస్తిత్వ ఉద్యమాలకు ఆదివాసీ సమాజం కదిలి ఐక్య పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ఆదివాసీ యువత పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జిఓ నెంబర్ 3 పునరుద్ధరణపై ఆదివాసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పందించాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీ యువతి శీరీషపై జరిగిన లైంగిక దాడి పాస్ట్ ట్రాక్ కోర్టులో కేసును విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, ఊకె శిరీష కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చెపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య,సోయం జోగారావు,గౌరీ నాగేశ్వరరావు, మడివి రమేష్, సోడెం ప్రసాద్, సర్పంచులు వగ్గేల రాధ,గంపా సూజాత, మాజి సర్పంచ్ కుంజా భాస్కర్,కుంజా రాంమూర్తి,కొండ్రు రాఘవయ్య, వర్షా శ్రీరాములు, సున్నం శ్రీదేవి, పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు