అందుకే బోల్డ్ సీన్స్‌కు ఒప్పుకున్నా!
దక్షిణాది చిత్రసీమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్(Actress Amala Paul) ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని గడుపుతోంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా అమలా పాల్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను సరిగ్గా చూపించడం లేదనే విమర్శలపై స్పందిస్తూ.. అందుకు ఇండస్ట్రీ మొత్తానిన నిందించడం కరెక్ట్ కాదని అభిప్రాయాన్ని వ్యక్తపర్చింది.
“కొన్ని సినిమాల్లో మహిళలను చూపించే విధానం సరిగ్గా లేకపోవడానికి చిత్రపరిశ్రమ కారణం కాదు, అది కేవలం ఆ సినిమా టీమ్ లేదా ఆ దర్శకుడి ఆలోచనా లోపం అయి వుండొచ్చు. ఏదేమైనా కాలం మారుతోంది, ఇప్పుడు ఇండస్ట్రీలో మహిళా ప్రాధాన్య చిత్రాలు భారీగా వస్తున్నాయి. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లకు పైగా అయింది. ఇప్పుడు మహిళలు తమకు తగిన స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మార్పు రాబోయే రోజుల్లో మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నేను నమ్ముతున్నా. నా కెరీర్‌లో మూస ధోరణిలో సాగలేదు. కొత్తదనం ఉన్న సినిమాలే చేయడానికి ఇష్టపడ్డాను.
అందులో భాగంగానే 2019లో ‘ఆడై’ లాంటి బోల్డ్, రిస్క్ ఉన్న సినిమా చేశాను. అయితే, ఆ సమయంలో నా ఇమేజ్ ఏమవుతుందనే భయం ఎక్కువగా ఉండేది. మళ్లీ అలాంటి పాత్రలే వస్తాయేమోనని బాగా ఆందోళనకు గురయ్యా. దాదాపు రెండు నెలల దాకా ఆ సీన్ చేయడానికి టీమ్‌కు ఓకే చెప్పలేదు. ఆ మూవీ టీమ్‌పై పూర్తి నమ్మకం కలిగిన తర్వాతే సైన్ చేశా. బోల్డ్ సీన్ షూట్ చేసేటప్పుడు నా చుట్టూ అతితక్కువ మంది ఉండే ఏర్పాట్లు చేశారు. అందుకే ఎలాంటి భయం లేకుండా ఆ సీన్‌లో నటించేశా. ఇప్పుడు ఆలోచిస్తే, ఆ రోజు నేను చేసిన సాహసం చాలా పెద్దదనిపిస్తుంటుంది. మళ్లీ అలాంటి అవకాశం వస్తే ఇప్పుడు మాత్రం చేయలేను” అని చెప్పుకొచ్చింది అమలా పాల్.