తెలంగాణ విలీన దినోత్సవం.. జాతీయ జెండాను ఎగురవేసిన ఏఎంసి చైర్మన్
17-09-2026 | 05:01pm
బోథ్. సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ(Market Committee Chairman Mallepula Satyanarayana) జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రం విలీనమైందన్నారు. ఎంతోమంది పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం నీ వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.