హైదరాబాద్‌కు అమిత్ షా.. తెలంగాణపై ఫోకస్!

03-10-2026 | 07:09am

కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఇవాళ రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రాత్రికి నగరంలోనే బస చేయనున్నట్లు సమాచారం. అమిత్ షా రాకతో తెలంగాణ బీజేపీలో(BJP) సందడి నెలకొంది. రాష్ట్ర పార్టీ కీలక నేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు జీహెచ్ఎంసీ(GHMC), ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఆదివారం అమిత్ షా తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో డెయిరీ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం కరీంనగర్‌కు వెళ్లనున్నారు. కరీంనగర్‌లో ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ(Silver Jubilee) వేడుకలకు హాజరుకానున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు