మోదీకి శుభాకాంక్షల వెల్లువ
- ప్రధాని కృషితో.. వికసిత్ భారత్ వైపు దేశం
- లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు
- మోదీజీకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలి
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ
- వివిధ దేశాల అధినేతలు కూడా సోషల్ మీడియాలో విషెష్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 76వ పుట్టినరోజు సందర్భం గా, ఆయన ప్రజాజీవితాన్ని 25 ఏళ్లకు పైగా చేరిన సందర్భంగా ఆయనకు గురువారం దేశ విదేశాల వ్యాప్తంగా హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మోదీ 76వ పుట్టినరోజు వేడుకలు దేశంలో అంబరాన్ని అంటాయి.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ, సిక్కిం, ఢిల్లీ ముఖ్యమంత్రులు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు, ప్రేమ్ సింగ్ తమ ంగ్, రేఖాగుప్తా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బీ జేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కొని యాడారు. మోదీ ప్రజాజీవి తాన్ని, అభివృద్ధి, స్వావలంబన, ఆవిష్కరణలు, డిజిటల్ పురోగతి, మౌలిక సదుపాయాలు, సంక్షేమా నికి ఆయన చేసిన కృషిని ప్రశంసిం చారు.
అలాగే స్వచ్ఛ భారత్, ఉజ్వల, జన్ ధన్, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు, సంస్కరణలను కొనియాడారు. భారతదేశ ఇంధన భద్రతను, ప్రపంచ స్థాయిలో దాని స్థానాన్ని బలోపేతం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతోం దని స్పష్టం చేశారు. విక్సిత్ భారత్ దార్శనికత దిశగా పురోగతి కొనసాగుతుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మోదీజీకి మంచి ఆరోగ్యం, దీర్ఘా యువు కలగాలని ఆకాంక్షిస్తూ.. ఎక్స్ ఖాతాల్లో పేర్కొన్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లా దిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సహా పలువురు ప్రపంచ నాయకులు ప్రధాని మోదీకి బర్త్‌డే విషెస్ తెలిపారు. ప్రధాని మోదీకి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ శుభాకాంక్షలు తెలిపారు. నటులు షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్, నటుడు అజయ్ దేవగన్ తదితరులు కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మోదీపై వివిధ దేశాధినేతల ప్రశంసలు
భారత్‌లోని అమెరికా రాయబార కార్యా లయం కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున మోదీకి శుభాకాంక్షలు తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీకి హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటలీ ప్రధాని మెలోని కూడా ప్రధాని మోదీకి ఇటాలియన్ భాషలో విషెస్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యా హు అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్‌లో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకా ంక్షలు, నరేంద్ర! మీ నాయకత్వం భారతదే శాన్ని ఒక ప్రపంచ శక్తిగా మార్చింది’ అని అన్నారు.