calender_icon.png 25 May, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెట్‌లో ఆంధ్రా కింగ్

25-05-2025 12:00:00 AM

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేశ్‌బాబు పీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.

కన్నడ స్టార్ ఉపేంద్ర ఈ చిత్రంలో సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా ఉపేంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో కథానాయకుడు రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా రావు రమేశ్, మురళిశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీ గణేశ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ - మెర్విన్; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్.