calender_icon.png 25 May, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొరియాలో కొత్త షెడ్యూల్

25-05-2025 12:00:00 AM

వరుణ్‌తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ ఇండో-కొరియన్ హారర్-కామెడీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మేకింగ్ టైటిల్ ‘వీటీ15’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లోని థ్రిల్లింగ్, పంచ్ హ్యూమర్‌తో కూడిన సన్నివేశాలను హైదరాబాద్, అనంతపూర్ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించారు.

వరుణ్‌తేజ్, రీతికా నాయక్, సత్య, మిర్చి కిరణ్ ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ సీన్లలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా తర్వాతి ఇంటర్నేషన్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. ఆ షెడ్యూల్ కొరియాలో జరుగుతుందని టీమ్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్ థమన్; ఆర్ట్: పన్నీర్ సెల్వం.