25-05-2025 12:00:00 AM
సిద్ధార్థ్ హీరోగా శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘3బీహెచ్‌కే’. బ్లాక్‌బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వశాంతి టాకీస్‌పై తెలుగు-, తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
తాజాగా మేకర్స్ ‘కలలన్నీ’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చె.. కష్టాలనే దాటే సుఖములనే తెచ్చే..’ అంటూ సాగుతోందీ పాట. అమృత్ రామ్‌నాథ్ ఫ్యామిలీ మెలోడీగా కంపోజ్ చేసిన ఈ పాటకు రాకేందు మౌళి గీత సాహిత్యాన్ని అందించారు.
హేమచంద్ర వేదాల, గోపికా పూర్ణిమ, సాహితీ చాగంటి, పీవీఎన్‌ఎస్ రోహిత్ ఆలపించారు. జూలై 4న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి డీవోపీ: దినేశ్ కృష్ణన్ బీ, జితిన్ స్టానిస్లాస్; ఎడిటర్: గణేశ్ శివ; ఆర్ట్: వినోద్ రాజ్‌కుమార్ ఎన్.