అంగన్వాడి కేంద్రాల సేవలు సద్వినియోగం

03-10-2026 | 10:14pm

కొమరవెల్లి,(విజయక్రాంతి): అంగన్వాడి(Anganwadi) కేంద్రాల ద్వారా అందించే సేవలను గర్భిణీల తో పాటు బాలింతలు వినియోగించుకోవాలని అంగన్వాడి సూపర్వైజర్ చంద్రకళ(Anganwadi Supervisor Chandrakala) తెలిపారు. మండలంలోని తపస్ పల్లి గ్రామంలో మండల స్థాయి పోషణ మాసం వేడుకల(Poshan Maasam celebrations)ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు వినియోగించడం అలవాటు చేసుకోవాలని కోరారు.

అనంతరం ఎంఈఓ కోనేటి రవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం తీసుకునే ఆహారంలో ఆహార వైవిధ్యతను పాటిస్తూ, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం గర్భిణీలు, బాలింతలు, ఆరు సంవత్సరాల లోపు పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కోఆర్డినేటర్ పుట్ట కనకరాజు , అంగన్వాడి కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు