బీఆర్ఎస్‌కు గుడ్‌బై

25-09-2026 | 12:18pm

కాంగ్రెస్‌లోకి అనిశెట్టి రామకృష్ణ

సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక 

గోవిందరావుపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ(BRS party) సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త,  రైస్‌మిల్లు యజమాని అనిశెట్టి రామకృష్ణ బీఆర్ఎస్ పార్టీని వీడి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క(Minister Seethakka) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అనిశెట్టి రామకృష్ణకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వస్తున్నారని నాయకులు తెలిపారు.

ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ(Congress party)ని మరింత బలోపేతం చేస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీకి ప్రజల మద్దతును కూడగడుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో అనిశెట్టి రామకృష్ణ కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి మరింత బలం చేకూర్చిందని నాయకులు పేర్కొన్నారు. పైడాకుల అశోక్ మార్గదర్శకత్వంలో ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని వారు అన్నారు. కాంగ్రెస్ కుటుంబంలోకి వచ్చిన అనిశెట్టి రామకృష్ణకు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, ములుగు జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, కాసర్ల రాంబాబు, గుండెబోయిన అనిల్ యాదవ్, కాడబోయిన రవి, దేపాక కృష్ణ, గొంది కిరణ్, తొడుసు కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు