సాయిరాం యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

21-09-2026 | 10:02pm

గణపురం: గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలోని ఐబీ రోడ్డు కాలనీలో సాయిరాం యూత్ ఆధ్వర్యంలో సోమవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గణపురం మేజర్ గ్రామపంచాయతీ(Ganapuram Major Gram Panchayat) సర్పంచ్ కట్కూరి శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ సిఐ, బూర రాజ్ గోపాల్ గౌడ్ రజిత దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా  గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిరాం యూత్ సభ్యుల బృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు