అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు
ఇల్లంతకుంట,(విజయక్రాంతి): అనంతగిరి గ్రామంలోని అన్నపూర్ణ ప్రాజెక్టు పంపు హౌస్ లు వెంటనే ఆన్ చేయాలి అని మాజీ జడ్పి వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు అన్నాడు. శుక్రవారం మిడ్ మానేరు జలాశయం నుంచి ఎల్ఎండికి నీటిని విడుదల చేసిన సందర్భంగా పొత్తూరు బ్రిడ్జి పైన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధం వేణు మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మిడ్ మానేరు నుండి నీటిని విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాడు.
గతంలో పోత్తూరు బ్రిడ్జి పైన రైతాంగానికి సాగునీరు తాగునీరు అందించాలి అని ధర్నా కార్యక్రమం నిర్వహించం కాబట్టి ఈ రోజు నీటిని విడుదల చేసారు అన్నాడు, మెట్ట ప్రాంతమైన ఇల్లంతకుంట, బెజ్జంకి ,గన్నేరువరం మండలాలకు సాగునీరు తాగునీరు కావాలంటే మిడ్ మానేరు జలాశయం నుండి అనంతగిరి అన్నపూర్ణ జలాశయాన్ని నింపి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వవలసిన బాధ్యత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పైన ఉన్నది అన్నాడు. అన్నపూర్ణ జలాశయం నింపితే బిక్క వాగు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సాగునీరు తాగునీరు అందుతుంది.లేనట్టయితే పంటలు ఎండిపోయి రైతాంగం నష్టపోతారు అన్నాడు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నపూర్ణ ప్రాజెక్టు నింపాలని అన్నాడు,లేని పక్షంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తాం అన్నాడు.






