6 September, 2026 | 2:37 AM

అనురాగ్ యూనివర్సిటీ–మూస్ ఇండియా మధ్య కీలక ఒప్పందం

06-09-2026 | 12:45am

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University)లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగం, భారత్, శ్రీలంక, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోమూస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ(Lomus India Private Limited)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం  అని తెలిపారు.

ఈ అవగాహన ఒప్పందంపై లో మూస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ వినోద్ కుమార్ కిల్లే సంతకం చేశారు. ఈ ప్రక్రియను అనురాగ్ యూనివర్సిటీ విభాగాధిపతి డాక్టర్  ఎ. మల్లికార్జునరెడ్డి(AU Head of Department Dr. A. Mallikarjuna Reddy), అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. శ్రవంత్ కుమార్ రామకూరి సమన్వయం చేశారు. ఈభాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమ ఆధారిత ప్రాజెక్టులు, సాంకేతిక శిక్షణ, పరిశోధనా సహకారం, గెస్ట్ లెక్చర్లు, ప్లేస్‌మెంట్ అవకాశాలు వంటి అనేక ప్రయోజనాలు లభించనున్నాయి.

మరిన్ని వార్తలు