నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు

17-09-2026 | 05:24pm

మణుగూరు,సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): గణేష్ నిమజ్జనం(Ganesh Immersion) ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి(DSP Ravinder Reddy) తెలిపారు. మణుగూరు సబ్‌డివిజన్ పరిధిలోని గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కొండాయిగూడెం గోదావరి పుష్కర ఘాట్ వద్ద అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సింగరేణి, గురువారం మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ, పంచాయతీ అధికారులతో పాటు జాలర్లతో కూడా చర్చించినట్లు డీఎస్పీ వెల్లడించారు. గోదావరిలో నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే ప్రజలు పోలీసులకు, అధికారులకు సహకరించాలని, భద్రతా సూచనలు పాటించాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు