ఓమ్‌లో కార్తికేయన్‌గా..
హీరో ధనుష్(Hero Dhanush) నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా(Action drama) ‘ఓమ్: చాప్టర్1- ఉధిరం’. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Malayalam Megastar Mammootty) పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయన పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియో గ్లింప్స్(Special Video Glimpses)ను మేకర్స్ రిలీజ్ చేశారు. మమ్ముట్టి ఈ సినిమాలో కార్తికేయన్(Karthikeyan) అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ‘గతాన్ని వదిలేస్తేనే.. భవిష్యత్తు బాగుంటుంది’ అంటూ ప్రారంభమైన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
కార్తికేయన్ గురించి ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ వెతుకుతుంటే ఆయనేమో తనకేమీ పట్టనట్లు క్రికెట్ మ్యాచ్(Cricket match) చూస్తుండటం వంటి సీన్స్‌ను ఈ వీడియోలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మగ్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది.