కెసిఆర్ పై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
మండల బీఆర్ఎస్ నాయకులు, స్థానిక స్టేషన్లో ఫిర్యాదు
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): కెసిఆర్ పై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రాణహాని కలిగించే కుట్రపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక తెలంగాణ అవతరణ కోసం అనేక ఉద్యమాలు జరిపి నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చిన మహానేత కేసిఆర్ పై హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని వారికి ప్రాణహాని ఉంది.
ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన తగిన చర్యలు తీసుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి భద్రత పెంచాలని పోలీస్ శాఖ నుండి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో, మండల ప్రధాన కార్యదర్శి,ఎస్.కె బాబా ఉపాధ్యక్షులు ఖయ్యూం ఉపసర్పంచ్ అరీఫ్ , యువజన నాయకులు ఆదమ్, చింటూ, భాస్కర్, రామాంజిగూడెం వార్డ్ మెంబర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.