నర్సాపురంలో అవగాహన సమావేశం

03-10-2026 | 12:11am

ములకలపల్లి,అక్టోబర్ 2 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం నర్సాపురంగ్రామంలో ధాన్ ఫౌండేషన్(DHAN Foundation) ఆధ్వర్యంలో సమాజం పర్యావరణ సమగ్ర అభివృద్ధి అనే అంశంపై శుక్రవారం గ్రామస్థులు,రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సుమారు 90 మంది రైతులు అలాగే ధాన్ ఫౌండేషన్ సిబ్బంది,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుటుంబం,సమాజం, పర్యావరణం సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం, కమ్యూనిటీ నాయకత్వం, జీవనోపాధి అభివృద్ధి,నీటి భద్రత, వ్యవసాయం,ఆరోగ్యం, విద్య,పర్యావరణ పరిరక్షణ అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు.

ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని,వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం ద్వారా స్థిరమైన,సమగ్ర అభివృద్ధి సాధించవచ్చని సమావేశంలో చర్చించారు. అలాగే గ్రామ ప్రజలే తమ అభివృద్ధికి నాయకత్వం వహించేలా కమ్యూనిటీ ఓనరషిప్, లీడర్షిప్ ను బలోపేతం చేయాలని సూచించారు.ప్రజల భాగస్వామ్యంతో కుటుంబం–సమాజం–పర్యావరణ సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యం అని కార్యక్రమంలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు